తెలంగాణలో ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాల వెల్లడి

  • రీ వెరిఫికేషన్ లో 1,137 మంది విద్యార్థుల ఉత్తీర్ణత
  • మొదటి సంవత్సరం విద్యార్థులు 585 మంది పాస్
  • రెండో సంవత్సరం విద్యార్థులు 552 మంది ఉత్తీర్ణత
తెలంగాణలో ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడయ్యాయి. రీ వెరిఫికేషన్ లో 1,137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ పూర్తయింది. 19,788 జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి కావాల్సి ఉందని, ఈ రాత్రికి లేదా రేపు అప్ లోడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రీ వెరిఫికేషన్ లో రెండో సంవత్సరం విద్యార్థులు 552 మంది, మొదటి సంవత్సరం విద్యార్థులు 585 మంది ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. పాసైన విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మూడు రోజుల్లో వెల్లడిస్తామని అన్నారు. 
Go Back to Shorts
Telangana
Inter mediate board
Re-verification

More Telugu News